ఫ్యాన్స్‌కి సాయి ధ‌ర‌మ్ తేజ లేఖ‌

Sia Dharam Tej asks fans not to waste money for his birthday celebrations
Sunday, October 14, 2018 (All day)

వ‌రుస‌గా ఆరు ఫ్లాప్‌లు రావ‌డంతో సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ‌కి తెలిసొచ్చింది తాను సినిమాల సెల‌క్ష‌న్ల విష‌యంలో త‌ప్పు చేస్తున్నాన‌ని. తేజ్ ఐల‌వ్యూ అట్ట‌ర్‌ఫ్లాప్ కాగానే అమెరికా వెళ్లిపోయాడు. మేకోవ‌ర్ చేయించుకొని తిరిగి ఇండియాకి వ‌చ్చాడు. నాలుగు నెల‌ల గ్యాప్ తీసుకొని ఇపుడు కొత్త‌గా సినిమాలు ఒప్పుకునేందుకు రెడీ అవుతున్నాడు. తాను చేసిన త‌ప్పులు ఏంటి, ఇక‌పై ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంద‌ని త‌న అభిమానుల స‌ల‌హాలు కూడా తీసుకుంటున్నాడు. 

తాజాగా అభిమానుల‌కి రాసిన లేఖ‌లో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. అక్టోబ‌ర్ 15న సాయి ధ‌ర‌మ్ పుట్టిన రోజు. 

నా పుట్టిన రోజు నాడు అభిమానులు అక్క‌డ‌క్క‌డా కేక్ క‌టింగ్‌లు, బ్యాన‌ర్లు క‌ట్ట‌డం వంటి చేస్తున్నార‌ని చెప్పారు. వాటికి పెట్టే ఖ‌ర్చు బ‌దులు..ఆ డ‌బ్బుని ఎవ‌రైనా చిన్నారి చ‌దువుకి ఉప‌యోగించండి. అలా చేస్తే నేను ఇంకా ఎక్కువ‌గా ఆనంద ప‌డుతాన‌ని త‌న అభిమానుల‌కి రాసిన లేఖ‌లో పేర్కొన్నాడు. 

అలాగే అభిమానుల స‌ల‌హాల‌తోనే త‌న‌ని కొత్త‌గా ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా అని తెలిపాడు.