అరవింద సమేత..అన్నీ గాలి కబుర్లే

"అరవింద సమేత" టీమ్ రిలీజ్ డేట్ టార్గెట్‌ని రీచ్ అయ్యేందుకు చాలా కష్టపడుతోందని ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ సినిమా షెడ్యూల్స్ అనుకున్న డేట్ ప్రకారమే సాగుతున్నాయి. ఒక్క రోజు కూడా షెడ్యూల్‌కి బిహిండ్ లేదు. అలాంటపుడు ఎక్స్‌ట్రా వర్క్ చేసే అవసరం ఏముంది.
సినిమా మొదలుపెట్టినపుడే దసరాకి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 11న రిలీజ్ చేయాలనేది ఇపుడిపుడు వచ్చిన ఆలోచన కాదు. రిలీజ్ డేట్ విసయంలో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి పెరుగుతోందనేది ట్రాష్.దసరాకి "అరవింద సమేత"ను రిలీజ్ చేయాలంటే ఇంకో 40రోజులే సమయం ఉంది కాబట్టి టీమ్ అంతా అపసోపాలు పడుతోందనేది గాలి వార్తే.
త్రివిక్రమ్ ఈ సినిమా మొదలుపెట్టినపుడే సెప్టెంబర్ వరకు పూర్తయ్యేలా ప్లాన్ చేశాడు. అలాగే షూటింగ్ జరుగతోంది. ఎన్టీఆర్ ఈ మూవీ కోసం నాన్‌స్టాప్‌గా వర్క్ చేస్తున్నాడు. హీరోయిన్ పూజా హెగ్డే నుంచి డేట్స్ కూడా ముందే పక్కా ప్లానింగ్‌తో తీసుకున్నారు.
మరోవైపు, ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించనున్నాడు బిగ్‌బాస్ ఫేమ్ ఆదర్శ్ బాలకృష్ణ. తన పాత్రకి సంబంధించిన షూటింగ్‌ని పూర్తి చేసిన అనంతరం ఈ ఫోటోని షేర్ చేశాడు.
- Log in to post comments