ఏడు చేపల్లో శ్రీరెడ్డి ఒక చేప

Sri Reddy's episode in 7 Chepala Katha
Friday, November 8, 2019 - 17:30

నిన్న రిలీజైన ఏడు చేపల కథ సినిమాకు సంబంధించి ఆలస్యంగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరెడ్డి క్యారెక్టర్ ఉంది. పూర్తిగా ఆమెను ప్రతిబింబించేలా పాత్రను చూపించలేదు కానీ, శ్రీరెడ్డి ఏ ఘటనతో పాపులర్ అయిందో, ఆ సన్నివేశాన్ని యాజ్ ఇటీజ్ గా ఏడు చేపల కథ సినిమాలో వాడారు.

ఫిలింఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్థ నగ్నంగా ధర్నా చేసిన సంగతి తెలిసిందే. టాప్ మొత్తం తీసేసి ఆమె రోడ్డుపైనే నిరసన వ్యక్తంచేసింది. అప్పట్లో శ్రీరెడ్డి చేసిన ఆ పని సంచలనం అయింది. సరిగ్గా అదే సీన్ ను ఏడు చేపల కథ సినిమాలో కూడా పెట్టారు. భానుశ్రీ ఆ సన్నివేశంలో నటించింది. శ్రీరెడ్డికి ఏమాత్రం తీసిపోని విధంగా అంతే బోల్డ్ గా నటించి కుర్రాళ్లకు అందాల విందు అందించింది భానుశ్రీ.

మరోవైపు ఏడు చేపల కథ మొదటి రోజు బాగానే మెరిసింది. టీజర్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో కుర్రాళ్లు థియేటర్లకు ఎగబడ్డారు. అయితే కుర్రకారు ఆశించిన స్థాయిలో సినిమాలో హాట్ సీన్లు లేవు. అయితేనేం తొలిరొజు అనుకున్న టార్గెట్ ను అందుకుంది యూనిట్.