పవన్ కల్యాణ్ కొడుకు పేరు వెనుక కథేంటి?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇటీవల ఒక బాబుకి జన్మనిచ్చింది. ఆ బాబు పేరు కుషాల్ బాబు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు సాగాయి. కానీ నిజం ఏమిటంటే పవర్‌స్టార్... ఆయన భార్య అన్నా ఆలోచనలు, ఆమె మత సంప్రదాయాలకి విలువిచ్చే వ్యక్తి. ఆమె ఇష్ట ప్రకారమే పేరు పెట్టాడు. తన కూతురు, కొడుకు ఇద్దరూ పేర్లు ఆమె అభిప్రాయాలకి అనుగుణంగానే పెట్టాడు.
ఇటీవల పుట్టిన బాబు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్.
మార్క్ అంటే క్రైస్తవ మతంలో బాగా పాపులర్ పేరు. మార్కస్ అనే దేవుడికి షార్ట్ నేమ్ అని చెప్పొచ్చు. ఇక శంకర్ అనే పదాన్ని మెగాస్టార్ చిరంజీవి అసలు పేరులోని శివశంకర వరప్రసాద్ లోంచి తీసుకున్నారట. పవనోవిచ్ అనేది పవన్ అనే పేరుకి రష్యన్ టచ్. అన్నా కొణిదెల రష్యా ఆర్థోడక్స్ చర్చ్ మత సంప్రదాయాలను పాటిస్తారు. అందుకే ఇలా మార్క్ శంకర్ పవనోవిచ్ అని బాబుకి నామకరణం చేశారు.
అన్నా మతాచారాలకి విలువినిచ్చారు పవర్‌స్టార్. ఇక ఆమె తన భర్త పవర్‌స్టార్ కుటుంబ సభ్యులకి గౌరవమిస్తూ కొడుక్కి మెగాస్టార్ పేరు వచ్చేలా, కూతురుకి పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి కలిసి వచ్చేలా చూసుకున్నారు.
పవన్‌కల్యాణ్ - అన్నాలకి పుట్టిన మొదటి కూతురికి పొలినా అంజనా పవనోవా అనే పేరుని పెట్టారు. ఇందులో అంజనాదేవి పేరు కలిసొచ్చింది. ఇది పేర్ల వెనుక ఉన్న అసలు కథ.
- Log in to post comments