సునీల్ పని అయిపోయినట్టేనా!

Sunil getting no offers again
Saturday, November 23, 2019 - 19:00

హీరోగా విశ్వప్రయత్నాలు చేశాడు. హీరోగా చేసిన తొలి సినిమా, మధ్యలో వచ్చిన మర్యాదరామన్న తప్ప మరేవీ పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఒక దశలో సునీల్ కు హీరోగా మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు కూడా వెనక్కి వెళ్లిపోయారు. దీంతో మరోసారి కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు సునీల్. సో.. ఇక భవిష్యత్ మొత్తం బంగారుమయం అనుకున్నాడు. కానీ సునీల్ కు మరోసారి షాక్ తప్పలేదు.

కమెడియన్ గా మారిన తర్వాత కూడా సునీల్ క్లిక్ అవ్వలేదు. అతడికి పాత్రలైతే వస్తున్నాయి కానీ ఒకప్పటికి కామెడీ మెరుపులు సునీల్ లో పూర్తిగా కనుమరుగయ్యాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి రేంజ్ లో కామెడీని ఆశించిన ప్రేక్షకులను సునీల్ తృప్తిపరచలేకపోయాడు. చివరికి ఈ విషయంలో క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ కూడా ఏం చేయలేకపోయాడు.

ఫలితంగా కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సునీల్ కు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఆఫర్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన సునీల్ ఇప్పుడు విసిగిపోయాడు. ఎంతమంది హీరోలతో ఎన్ని కాంబినేషన్లు ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. రీసెంట్ గా గోపీచంద్ తో చేసిన చాణక్య కూడా బెడిసికొట్టడంలో సునీల్ ఇప్పుడు పూర్తిగా జాబ్ లెస్ అయిపోయాడు. బ్రహ్మానందంకు గతంలో బ్రేక్ వచ్చినట్టు, సునీల్ కు ఎప్పుడు బ్రేక్ వస్తుందో చూడాలి.