"అజ్ఞాతవాసి" అలా మిస్ అయ్యా: సునీల్‌

Sunil gives clarificationwhy he didn't accept Agnyaathavaasi
Thursday, December 28, 2017 - 19:00

మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి సునీల్‌కి ఒక ప్ర‌శ్న ఎదుర‌వుతుంటుంది. త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడంటూ అతన్ని క్వశ్చన్ చేయడం కామన్. ఎందుకంటే వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మరి. అందుకే ఎంతమంది అడిగినా ఈ విషయంపై ఓపిగ్గా రియాక్ట్ అవుతాడు సునీల్. తాజాగా త్రివిక్రమ్ తీసిన షఅజ్ఞాతవాసి సినిమాపై సునీల్ రెస్పాండ్ అయ్యాడు. క్యారెక్టర్ నచ్చక అజ్ఞాతవాసి నుంచి తప్పుకున్నట్టు తెలిపాడు.

"అవును.. అజ్ఞాతవాసికి సంబంధించి మా మధ్య చర్చలు జరిగాయి. కాకపోతే నేను ఎంటర్ అయ్యే టైమ్ కే స్క్రీ న్ ప్లే లాక్ అయింది. అప్పటికీ ఓ క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశాడు త్రివిక్రమ్. కానీ అది మ‌రీ చిన్న పాత్ర‌. అలా అజ్ఞాతవాసిలో నటించడం కుదరలేదు." అజ్ఞాతవాసిపై సునీల్ రియాక్షన్ ఇది.

ఇకపై హీరోగా కొనసాగుతూనే, మిగతా సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తానని మరోసారి స్పష్టంచేశాడు సునీల్. త్రివిక్రమ్ తో కూడా సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

"ప్రస్తుతం త్రివిక్రమ్ వరల్డ్ కప్ ఆడుతున్నాడు. నేనేమో గల్లీ క్రికెట్ ఆడుతున్నాను. వరల్డ్ కప్ ఆడుతున్న త్రివిక్రమ్ ను పిలిచి నాతో గల్లీ క్రికెట్ ఆడమంటే బాగుండదు కదా. అయినా త్రివిక్రమ్ తో నా సినిమా ఎంత లేట్ అయితే అంత మంచిది. ఎందుకంటే అప్పటికి త్రివిక్రమ్ మార్కెట్ మరింత పెరుగుతుంది. అది నాకే ప్లస్ కదా". ఇలా చెప్పుకొచ్చిన సునీల్.. ఎప్పటికైనా త్రివిక్రమ్ తో మూవీ చేస్తానంటున్నాడు.