నేను క్షేమంగానే ఉన్నా: సునీల్

Sunil responds on rumors about his health condition
Monday, February 3, 2020 - 18:15

హీరో సునీల్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడనేది తెలిసిన మ్యాటరే. లేటెస్ట్ గా ఆయన చనిపోయాడు అంటూ కొన్ని మీడియాల్లో వార్తలు ప్రసారం అయ్యాయి. దాంతో సునీల్ స్పందించాడు. "నేను బతికే ఉన్నాను. క్షేమంగా ఉన్నాను. విజయవాడలో సినిమా షూటింగ్ కోసం వచ్చాను. నా ఆరోగ్యం పై కొందరు మిత్రులు ఆందోళన చెందుతున్నట్లు నాకు తెలిసింది. అటువంటి పుకార్లు నమ్మవద్దు. అల్ ఈజ్ వెల్," అంటూ సునీల్ వివరణ ఇచ్చారు. 

సునీల్ ఆరోగ్యం గురించి పుకార్లు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా అయన చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరిగింది. పాపం సునీల్ ...ఎప్పటికప్పుడు తాను బతికే ఉన్నాను అని చెప్పుకోవాల్సి వస్తోంది.

సునీల్ ఇటీవల కామెడీ పాత్రల నుంచి సీరియస్ రోల్స్ వైపు మొగ్గు చూపుతున్నాడు. డిస్కో రాజా సినిమాలో విలన్ గా కూడా కనిపించాడు.