విగ్రహంతో సన్నీలియోన్

ఒకపుడు మేడం టుస్సాడ్స్‌లో ఒక సెలబ్రిటీ మైనపు విగ్రహం పెడుతున్నారంటే అదొక గౌరవం. ఆ స్టార్ పాపులారిటీకి నిదర్శనం. కానీ రీసెంట్‌గా సీన్ మారింది. మేడం టుస్సాడ్స్ మ్యూజియం కూడా కమర్షియల్ బాట పట్టింది. ప్రతి దేశంలో ఒక మ్యూజియం పెట్టేస్తోంది. లండన్, న్యూయార్క్ నుంచి తాజాగా బ్యాంకాక్, ఢిల్లీకి కూడా వచ్చింది. ఇన్ని మ్యూజియంలను నడపాలంటే కొత్త కొత్త సెలబ్రిటీలు కావాలి, వారి మైనపు విగ్రహాలు కావాలి కదా. అందుకే ప్రతి నెలకో బాలీవుడ్ సెలబ్రిటీని పిలిచి ఒక మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది మేడం టుస్సాడ్స్.
తాజాగా సన్నీలియోన్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఆ విగ్రహం ముందు ఇలా సన్నీలియోన్ ఫోజులు ఇవ్వడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో రావడం, ఆ వెంటనే జోకులు కూడా మొదలవడం వెంటవెంటనే జరిగాయి. సన్నీలియోన్ విగ్రహాన్ని చూసి యమా హాట్‌గా ఉందని మగవాళ్లు వేడెక్కితే.. రూమ్ టెంపరేచర్ పెరిగి మైనం కరిగిపోతుందేమో చూసుకొండి అంటూ జోకులు పడుతున్నాయి.
నా విగ్రహాన్ని చూస్తే ఆనందంగా ఉంది. సంభ్రమంగా అనిపిస్తోంది. ఈ విగ్రహాన్ని సరియైన షేప్‌లోకి తీసుకొచ్చేందుకు ఎంతో మంది శ్రమపడ్డారు. వారందరికీ అభినందనలు అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది సన్నీ.
- Log in to post comments