సన్నీలియోన్‌కి గట్టిగా సమర్పించిన హీరో!

సన్నీలియోన్ కనిపిస్తే మాస్‌లో టికెట్‌లు తెగుతాయి. హాట్‌నెస్‌కి మారుపేరు సన్నీ. అందుకే సన్నీలియోన్‌తో ఐటెంసాంగ్‌లు చేయించేందుకు ఫిల్మ్‌మేకర్స్ తెగ ఆసక్తి చూపుతుంటారు. కాకపోతే, ఆమె పారితోషికం చాలా ఎక్కువ. ఆమెకి ఇచ్చే రేట్లో మరో తెలుగు హీరోయినో, తమిళ భామనో తీసుకొని పాట చేయించుకోవచ్చు. అందుకే సన్నీలియోన్‌తో సెలక్టివ్‌గా ఐటెంసాంగ్‌లు చేయిస్తుంటారు.
హీరో విశాల్ మాత్రం సన్నీలియోన్ కావాలని పట్టుబట్టి తన కొత్త సినిమాలో ఆమెతో ఐటెంసాంగ్ చేయిస్తున్నాడట. విశాల్ ప్రస్తుతం "టెంపర్" సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సన్నీలియోన్‌తో స్పెషల్ సాంగ్ ఉందట. మొత్తమ్మీద ఈ పాట కోసం ఆమెకి బాగానే ముట్టచెప్పాడట. భారీగా సమర్పిస్తేనే ఆమె ఒప్పుకుంటుంది.
విశాల్ కూడా ఇపుడు కొంచెం ఊపు మీదున్నాడు. చాన్నాళ్ల తర్వాత హిట్స్ వచ్చాయి ఈ మధ్య. "అభిమన్యుడు" సినిమా బాగా ఆడింది. "పందెంకోడి 2" తెలుగులో సో సో అనిపించుకున్నా.. తమిళనాట మంచి విజయం సాధించింది. ఇక ఇపుడు "టెంపర్"తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని.. ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. అందుకే సన్నీకి అంత సమర్పించుకున్నాడన్నమాట.
- Log in to post comments