వెయిట్ అండ్ సీ: రజనీకాంత్

తమిళనాట రాజకీయాలకి చెన్నైలోని పోయెస్ గార్డెన్...కేంద్రంలాంటిది. కొన్ని దశాబ్దాలపాటు పోయెస్ గార్డెన్ ..తమిళ రాజకీయాలను శాసించింది. అవును.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్కడే నివాసం ఉండేది. ఆమె మరణంతో పోయెస్‌గార్డెన్ ఏరియా బోసిపోయింది. మళ్లీ ఆ ప్రాంతం.. తమిళ రాజకీయాలను శాసిస్తుందా అని అడిగితే రజనీకాంత్ ఇచ్చిన సమాధానం - వెయిట్ అండ్ సీ.
రజనీకాంత్ ఇల్లు జయలలిత ఇంటి పక్కనే. అదే పొయెస్ గార్డెన్ ఏరియాలోనే రజనీకాంత్ ఉంటాడు కాబట్టి జర్నలిస్ట్‌లు అడిగారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తాను పార్టీ పెడుతున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీ లేదు. సినిమాలపై సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే జర్నలిస్ట్‌లకి ఈ డౌట్ వచ్చింది.
మరోవైపు, కశ్మీర్ విషయంలో దేశంలోని ఏ పార్టీ కూడా రాజకీయం చేయకూడదని రజనీకాంత్ అంటున్నారు. దేశభద్రత కోణంలో ఈ అంశంలో ఎవరూ కాంట్రవర్సియల్ స్టేట్‌మెంట్స్ ఇవ్వొద్దనేది రజనీ మాట.
- Log in to post comments

























