సినిమాలోని ఒక సీన్ పుస్త‌కంగా

Taralu Digi Vacchina Vela in book form
Saturday, July 21, 2018 - 00:45

సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రీ జంట‌గా న‌టించిన ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ రూపొందించిన చిత్రం...`స‌మ్మోహ‌నం`. ఈ సినిమా క్ల‌యిమాక్స్‌.. పుస్త‌కావిష్క‌ర‌ణ గురించే.  అందులో త‌నికెళ్ల భ‌ర‌ణి `తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌` అంటూ.. అందులోని ఓ బుజ్జి క‌థ‌ను చ‌దువుతారు. బుజ్జి క‌థలో సినిమా క‌థ‌ అంత‌ర్లీనంగా ఉంటుంది. ఈ సీన్ సినిమాకి హైలెట్ అయింది. మూవీ విజ‌యం సాధించింది.

ఆ సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచి `తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌` పుస్త‌కం కాపీ కావాల‌ని చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటిని  అంద‌రూ అడగ‌డం మొద‌లుపెట్టార‌ట‌. దాంతో  `అన‌గ‌న‌గా` పేరుతో మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కూడా ఓ ప్ర‌చుర‌ణ సంస్థ‌ను మొద‌లుపెట్టి తొలి ప్ర‌చుర‌ణ‌గా `తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌`ను ప్ర‌చురించారు. 

తాజాగా ఈ పుస్త‌కాలు మార్కెట్లో అందుబాటులోకి వ‌చ్చాయి. తొలి కాపీని టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న‌య సితార అందుకున్నారు.