ఉడ్తా టాలీవుడ్: రేపట్నుంచే ఇంటరాగేషన్

Tolly Drugs Case: Interrogation will Start from Tomorrow
Tuesday, July 18, 2017 - 12:45

టాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో నోటీసులు ఎవరెవరికి వెళ్లాయనే విషయంపై ఇప్పుడు పెద్దగా చర్చ అవసరం లేదు. ఎవరెవరు ఇందులో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ పర్వం త్వరలోనే మొదలుకాబోతోంది. నోటీసులు అందుకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా బయటకు రాబోతున్నారు. మూడు దశల్లో ప్రముఖుల్ని విచారించాలని నిర్ణయించింది ఎక్సైజ్ సిట్. మొదట వ్యక్తిగత వివరాల గురించి ప్రశ్నిస్తారట. రెండో దశలో వ్యక్తిగత అలవాట్లు (ధూమపానం, మద్యపానం) గురించి అడుగుతారట. ఇక కీలకమైన మూడో రౌండ్ లో అసలైన ప్రశ్నలు బయటకొస్తాయని తెలుస్తోంది. 

మరోవైపు ఎవర్ని ఏ తేదీకి విచారణకు రావాలో కూడా నిర్ణయించారు. అందరి కంటే ముందు విచారణ ఎదుర్కొనేది దర్శకుడు పూరి జగన్నాధ్. రేపే ఈ దర్శకుడ్ని ప్రశ్నించబోతున్నారు. ఎక్కడ అనేది మాత్రం సస్పెన్స్. 20వ తేదీన చార్మి, 21న ముమైత్ ఖాన్, 22న తరుణ్, 23న శ్యామ్ కే నాయుడు, 26న నవదీప్, 27న సుబ్బరాజు, 28న నందు, రవితేజ.. విచారణను ఎదుర్కోబోతున్నారు. 

నలుగురు చొప్పున అధికారులు వీళ్లను దశలవారీగా ప్రశ్నిస్తారు. మొత్తం వ్యవహారాన్ని వీడియోలో రికార్డు చేస్తారు.