డ్ర‌గ్స్ కేసు: స్టార్స్ రియాక్ష‌న్‌

Tollywood celebs respond on drugs case
Saturday, July 15, 2017 - 16:15

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఈరోజు మరిన్ని మలుపులు తిరిగింది. ఇవ్వాల్సిన వాళ్లకు నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ పోలీసులు ఇప్పుడు ఒక్కో విషయాన్ని, ప్రతి ఒక్కరి రెస్పాన్స్ ను జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిన్నటివరకు గుంభనంగా ఉన్న ఈ విషయంపై ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు.

పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే..

“ఇప్పటివరకు నేను ఎవరిపైనా, దేనిపైనా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం పైసావసూల్ సినిమాను కంప్లీట్ చేయడంలో నేను చాలా బిజీగా ఉన్నాను.”

తనీష్ ఏమన్నాడంటే..

"మీకు దండం పెడుతున్నా. నన్ను వదిలేయండి ప్లీజ్. నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నన్ను పోలీసులు కలవలేదు. ఏమీ జరగలేదు. అలాంటివి ఉంటే నేను చెబుతాను. దయచేసి నా పేరు వేయొద్దు. నాకు సంబంధం లేదు. తప్పు ఎవరి చేసినా తప్పే. పోలీసులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటున్నారు తప్ప ఏదీ నిర్థారణ చేసి చెప్పలేదు. నాకు నోటీసులు రాలేదు. వస్తే వెళ్లి పోలీసుల్నికలవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు కావాలని ఫోకస్ చేసి పేర్లు వేస్తున్నారు"

సుబ్బరాజు రియాక్షన్..

"నాకు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. 21వ తేదీన సిట్ నిర్వహించే దర్యాప్తునకు హాజరుకావాలని అందులో ఉంది. అయితే నాకెందుకు నోటీసు వచ్చిందో అర్థం కావడం లేదు. ఆ డౌట్ నాలో ఇంకా ఉంది. వ్యవస్థను గౌరవించే వ్యక్తిగా ఆ రోజు నేను విచారణకు హాజరవుతాను. నా సర్కిల్ లో ఎవరికీ డ్రగ్స్ తీసుకునే అలవాట్లు లేవు. ఎందుకు లిస్ట్ లో పేరొచ్చిందో అర్థం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో".

నందు ఏమంటున్నాడంటే..

“అసలు డ్రగ్స్ గురించి నాకేం తెలీదు. నేను పుట్టిపెరిగిన వాతావరణం వేరు. నాకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదు. అసలు నా పేరు మీడియాలోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. దయచేసి పూర్తి వివరాలు తెలుసుకొని రాయండి”.

ఇక చార్మి పరోక్షంగా స్పందించింది..

“ఎవరైనా నిన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారంటే దానర్థం, నువ్వు వాళ్లకంటే పైన ఉన్నావని”. కేవలం ఈ ట్వీట్ మాత్రమే చేసిన చార్మి ఎక్కడా అసలు విషయాన్ని ప్రస్తావించలేదు.

రేపో మాపో మరింత మంది ఈ వివాదంపై మీడియా ముందుకు రాబోతున్నారు. అప్పటివరకు కొన్ని పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.