న‌టి మ‌ల్లిక క‌న్నుమూత‌

TV actress Mallika passes away
Monday, October 9, 2017 - 15:15

ప్ర‌ముఖ టీవీ న‌టి, యాంక‌ర్ మ‌ల్లిక (39) కన్ను మూసింది. కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. గ‌త ప‌క్షం రోజులుగా ఆమె కోమాలోనే ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ రోజు (అక్టోబ‌ర్ 9)న బెంగుళూరులోని ఆసుప‌త్రిలోనే తుదిశ్వాస విడిచింద‌ట‌.

ఆమె అసలు పేరు అభినయ‌. యాంక‌ర్‌గా బాగా పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత న‌టిగా స్థిర‌ప‌డింది. అనేక టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించింది. కొన్ని సినిమాల్లోనూ క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించింది.  మ‌హేష్‌బాబు హీరోగా రూపొందిన తొలి చిత్రం రాజకుమారుడు చిత్రంలో హీరో కృష్ణ భార్యగా నటించింది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన మ‌ల్లిక పెళ్లి త‌ర్వాత ఆమె బెంగుళూరులో స్థిర‌ప‌డింది.