బిత్తిరి సత్తిపై దాడి!

ఇపుడిపుడే ఎదుగుతోన్న కమెడియన్ బిత్తిరి సత్తిపై ఒక దుండగుడు దాడి చేశాడు. హెల్మెట్‌తో బలంగా మోదాడు. బలంగా దాడి చేయడంతో బిత్తిరి సత్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని స్టార్ ఆసుపత్రికి తరలించారు.
బిత్తిరి సత్తి V6 ఛానల్లో టీవీ యాంకర్. సినిమాల్లోనూ రెగ్యులర్‌గా నటిస్తున్నాడు. ఆ చానెల్ ముందే ఆయనపై దాడి జరిగింది.
దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన మణికంఠ అనే వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బిత్తిరి సత్తి తన "తీన్మార్" షో ద్వారా రాజకీయ, సినిమా ప్రముఖులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటాడు. ఆ షో ద్వారా హర్ట్ అయిన శక్తుల తాలుకు వ్యక్తి అయి ఉంటాడని ప్రాథమిక అనుమానం. అయితే బిత్తిరి సత్తి తన షోలో తెలంగాణని అవమానిస్తున్నాడని, అందుకే అతనిపై దాడి చేశానని మణికంట పోలీసుల విచారణలో తెలిపాడట. ఇదొక వైచిత్రి.
- Log in to post comments