మెగా హీరో నెంబ‌ర్ 11, మూవీ షురూ

Vaishnav Tej debut film launched
Monday, January 21, 2019 - 15:15

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్ప‌టికే పది మంది క‌థానాయ‌కులు వ‌చ్చేశారు. ఇపుడు నెంబ‌ర్ 11. ప‌దకొండు వికెట్లో వ‌స్తున్న హీరో పేరు.. పంజా వైష్ణ‌వ్ తేజ్‌. సాయి ధ‌ర‌మ్ తేజ్‌కి త‌మ్ముడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ క‌లిసి ఇత‌న్ని హీరోగా లాంచ్ చేశారు. సోమ‌వారం లాంఛ‌నంగా షూటింగ్ మొద‌లైంది.

నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నఈ  చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్  రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి , నిర్మాత అల్లు అరవింద్ ,నాగబాబు, అల్లు అర్జున్, వ‌రుణ్‌తేజ్‌ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు శివప్రసాద్, విజయ దుర్గ, చిరంజీవి తల్లి అంజనాదేవి,  మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల సైతం హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ని ప్రారంభించగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు.. నాగబాబు , అల్లు అర్జున్ స్క్రిప్ట్ ని అందజేశారు.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. అద్భుతమైన కథ రాశాడు. ఒక్క సిట్టింగ్ లోనే ఒకే చేసిన కథ ఇది. బుచ్చిబాబు గొప్ప డైరెక్టర్ అవుతాడని ఖచ్చితంగా చెప్పగలను. కొత్తమ్మాయి మనీషా తెలుగమ్మాయి.. చాలా మందిని టెస్ట్ చేసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు.. ఒక మంచి అమ్మాయి సినిమా కు ఎంపిక అయ్యింది.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న దేవిశ్రీప్రసాద్ కి చాలా థాంక్స్.. ఈ సినిమా ఆల్బం ఓ రేంజ్ లో ఉంటుంది.. తప్పకుండా చెప్పగలను.. వైష్ణవ్ కి మంచి ఫ్యూచర్ ఉంది, అన్నారు సుకుమార్‌.