నేను పారిపోలేదు: వ‌నిత

Vanitha Reddy Says she is not in absconding
Saturday, December 16, 2017 - 15:45

న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసులో హైద‌రాబాద్ పోలీసులు కొంత పురోగ‌తి సాధించారు. ఈ కేసులో ఆయ‌న భార్య వ‌నిత అరెస్ట్ త‌ప్ప‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. విజ‌య్ అంత్య‌క్రియ‌ల‌కి వ‌నిత రాలేదు. అప్ప‌ట్నుంచే ఆమె అజ్ఞాతంలో ఉంది. ఆమె పారిపోయి ఉంటుంద‌ని పోలీసులు మీడియాకి చెప్పారు. ఆమె కోసం అన్వేషణ మొద‌లుపెట్టారు.

ఐతే  ఆమె తాజాగా ఒక వీడియోని పోస్ట్ చేసింది. తాను ఎక్క‌డికీ పారిపోలేదన్నారు.

"నేను నా పాప కోసం  దూరంగా ఉంటున్నా. విజ‌య్‌ ఆత్మహత్యా కి నాకు సంబంధం లేదు. పోలీసులకు దొరక్కుండా దూరంగా ఉంటున్నా మాట నిజ‌మే. కానీ దానికి రీజ‌న్ ఉంది. నా పాప కోస‌మే ఇలా చేశా. విజయ్ నిజ స్వరూపం అందరికీ తెలియ‌చేస్తా. త్వరలోనే పోలీసులకి లొంగిపోతాను. విజ‌య్‌కి మూడేళ్ల పాటు దూరంగా ఉన్నాను. నేను అత‌ని నుంచి విడిపోయాను. ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కి సంబంధం ఎలా ఉంటుంది," అని ఆమె వీడియోలో పేర్కొంది.