చచ్చినా పెళ్లి చేసుకోను: వరలక్ష్మీ

వరలక్ష్మీ శరత్ కుమార్ అంటే తెలుగు ప్రేక్షకులకి విశాల్ గాల్‌ఫ్రెండ్‌గానే బాగా పరిచయం. తమిళ హీరో విశాల్ రెడ్డి చాలా కాలం వరలక్ష్మీతో డేటింగ్ చేశాడు. ఒక దశలో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కుతారు అని అనుకున్నారు అందరూ. అంత డీప్‌గా ఉండేది వీరి మధ్య రిలేషన్. మద గజ రాజా, పందెంకోడి 2 వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఐతే రీసెంట్‌గా వరలక్ష్మీకి డిచ్ కొట్టాడు విశాల్. హైదరాబాద్‌కి చెందిన ఆళ్ల అనీషాని పెళ్లాడనున్నాడు విశాల్. ఆమెతో ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయింది.
విశాల్ చేసిన పనికి ఆమెకి పెళ్లి మీద విరక్తి వచ్చినట్లుంది. చచ్చినా పెళ్లి చేసుకోను అని చెప్పింది వరలక్ష్మీ. ఆమె నటుడు శరత్‌కుమార్ కూతురు.
నాకు పెళ్లిపైన నమ్మకం లేదు. వివాహ వ్యవస్థ అవుట్‌డేటెడ్. నేను పెళ్లికి సూట్ అవను. అలాంటి ఆలోచనలే లేవు. ఇపుడే కాదు జీవితంలో ఎపుడూ పెళ్లి వైపు నా మనసు మళ్లదు అని తాజాగా స్టేట్‌మెంట్ ఇచ్చింది.
- Log in to post comments