వెంక‌టాపురంకి మొద‌టి వీకెండ్‌లో రూ.97 ల‌క్ష‌లు

Venkatapuram grosses Rs 97 lakhs in first weekend
Monday, May 15, 2017 - 16:30

"వెంకటాపురం" ఈ నెల 12న గ్రాండ్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌ద‌ల‌య్యి మంచి చిత్రంగా ప్ర‌శంశ‌లు పొందుతుంది.  హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మెద‌టి వీకెండ్ కంప్లీట్ చేసుకుని 92 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. 

"మొద‌టి మూడు రోజుల‌కి 97 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. రోజు రోజుకి మౌత్ టాక్ పెరిగి క‌లెక్ష‌న్లు పుంజుకుంటున్నాయి," అని ఆనందం వ్య‌క్తం చేశారు నిర్మాత‌లు. గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్‌, తూము ఫణి కుమార్ ఈ మూవీని నిర్మించారు. 

"హీరో రాహుల్ న్యూ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. దర్శకుడు వేణు అద్భుతమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మా చిత్రానికి సాయిప్ర‌కాష్ కెమెరా వ‌ర్క్ హైలెట్ గా నిలుస్తుంది. ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది," అని అన్నారు నిర్మాత‌లు.