వెన్నెల కిషోర్ ది రొట్ట టేస్ట్

Vennela Kishore has bad taste in food!
Monday, August 12, 2019 - 17:45

వెన్నెల కిషోర్, అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ వీళ్లంతా ఓ బ్యాచ్. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. ఓపెన్ గా ఒకరిపై ఒకరు పంచ్ వేసుకుంటారు. మరీ ముఖ్యంగా ట్విట్టర్ లో శేష్ పై పంచ్ లు కామన్. వెన్నెల కిషోర్ ఓ పంచ్ వేస్తాడు. దానికి రాహుల్ రవీంద్రన్ మసాలా దట్టిస్తాడు. ఫైనల్ గా శేష్ బుక్ అవుతాడు. అయితే ఈసారి మాత్రం వెన్నెల కిషోర్ ను ఆడుకునే ఛాన్స్ శేష్ కు వచ్చింది.

వెన్నెల కిషోర్ మంచి భోజన ప్రియుడు. కానీ ఫుడ్ విషయంలో అతడిది రొట్ట టేస్ట్ అంటున్నాడు అడవి శేష్. అమెరికాలో దొరికే వేస్ట్ ఫుడ్ అంటే వెన్నెల కిషోర్ ఎగబడి తింటాడని, అదేం టేస్టో తనకు అర్థంకాదంటాడు.

"కిషోర్ గాడికి అమెరికాలో ఆ రొట్ట ఫాస్ట్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. అది ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ అదే ఇష్టం. కిషోర్ స్క్రీన్ పైన ఫన్నీగా కనిపిస్తాడు కానీ బయట మాత్రం చాలా సెన్సిబుల్. వాడికో టేస్ట్ ఉంది. అంత టేస్ట్ ఉన్నోడికి ఇంత వేస్ట్ ఫుడ్ ఎలా ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆర్బీస్, టాకూబెల్ లాంటివి తింటాడు. మెక్ డోనాల్డ్స్ లో చీప్ గా, చెత్తగా ఏదైనా బర్గర్ ఉంటే అది వాడికి ఇష్టం. టేస్టీగా తింటాడు."

 

ఎవరు ప్రమోషన్స్ లో భాగంగా తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెబుతూ.. వెన్నెల కిషోర్ గురించి ఇలా మాట్లాడాడు శేష్. తమ గ్రూప్ లోకి కొన్నేళ్ల కిందట సమంత కూడా వచ్చి చేరిందని, పీవీపీ గారు సమంతను తనకు పరిచయం చేశారని అప్పట్నుంచి ఆమె క్లోజ్ అయిపోయిందంటున్నాడు శేష్.