విజయ్ ఆత్మహత్య: సంచ‌ల‌న సెల్ఫీ వీడియో

Vijay posts selfie video hours before committing suicide
Monday, December 11, 2017 - 17:15

న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసు అనేక మ‌లుపులు తిరుగుతోంది. ఆయ‌న భార్య, న‌టి వనిత వ‌ల్లే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఉద‌యం వార్త‌లు వ‌చ్చాయి. ఇపుడు ఒక వీడియో బ‌య‌టికి వ‌చ్చింది. ఆత్మ‌హ‌త్య‌కి కొద్ది నిమిషాల ముందు ఆయ‌న సెల్పీ వీడియో తీసుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు.

వాల్‌పోస్ట‌ర్ అనే సినిమా షూటింగ్ టైమ్‌లో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డి, పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. రెండేళ్ల క్రితం వీరి మ‌ధ్య విభేదాలు వ‌చ్చి కోర్టుకి వెళ్లారు. డివోర్స్ కేసు న‌డుస్తోంది. ఈ కేసుకి సంబంధించిన ఒక లాయ‌ర్‌, మ‌రో  
వ్యాపార‌వేత్త శ‌శిధ‌ర్ త‌న‌ని బెదిరించార‌ని, కొన్ని వీడియోలు చూపి మూడు కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేశార‌ని ఆయ‌న సెల్ఫీ వీడియోలో ఆరోప‌ణ‌లు చేశాడు విజ‌య్‌.

ఆయ‌న వీడియోలోని కొన్ని పాయింట్స్‌..

 • మా మధ్య శశిధర్ అనే వ్యక్తి తలదూర్చాడు
   
 • కేసు ఉపసంహరించుకోవాలి అంటూ మూడు కోట్ల డబ్బులు డిమాండ్ చేశారు
   
 • శశిధర్ ప్రోద్బలం తోనే వనిత న‌న్ను వేధించింది
   
 • డబ్బులు ఇవ్వలేదు  అని రెండు రోజులు క్రితం ఇంటి దగ్గర ఉన్న కారు, వస్తువులు తీసుకెళ్లారు
   
 • వనిత, శశిధర్, అడ్వకేట్ లే నా చావుకి కారణం
   
 • తనను మానసికంగా హింసించారు
   
 • అవసరాల కోసం నా భార్య‌తో శ‌శిధ‌ర్ వ్యభిచారం చేయించాడు.