రేపు ఏ సినిమా హిట్ అవుతుందో?

This Weekend Telugu Releases
Thursday, May 11, 2017 - 19:15

బాహుబలి-2 విడుదల తర్వాత మరో సినిమా థియేటర్లలోకి వచ్చే సాహసం చేయలేదు. మధ్యలో బాబు బాగా బిజీ సినిమా వచ్చినప్పటికీ.. కంటెంట్ లేకపోవడంతో ఫ్లాప్ అయింది. ఈవారం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో 4 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో ఒక సినిమాపై మాత్రం కూసింత అంచనాలున్నాయి. రేపు (May 12) రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది రాధ గురించే. వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్, రేపు రాధగా మనముందుకురాబోతున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన గా నటించిన ఈ సినిమాకు చంద్రమోహన్ దర్శకుడు. సినిమా టీజర్, ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

రాధ తర్వాత అంచనాలతో వస్తున్న సినిమా వెంకటాపురం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతున్న ఈ సినిమాలో హ్యాపీడేస్ ఫేం రాహుల్ హీరో. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా ట్రయిలర్ తో బాగానే ఎట్రాక్ట్ చేసింది.

రాధ, వెంకటాపురం సినిమాలతో పాటు రక్షక భటుడు, పోలీస్ పవర్ అనే మరో 2 సినిమాలు కూడా రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. రక్షకభటుడు సినిమాలో హీరోను చూపించకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అదొక్కటే ఈ సినిమాకు ప్రమోషనల్ యాంగిల్. మరి ఈ 4 సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.