విజ‌య‌శాంతి స్టెప్పు ఏంటి?

What is the next step for Vijayashanti?
Sunday, September 9, 2018 - 18:45

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తుగానే అసెంబ్లీ ర‌ద్దు చేయ‌డంతో ఎన్నిక‌లు అనివార్యం అయ్యాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు న‌వంబ‌ర్‌లో కానీ డిసెంబ‌ర్‌లో కానీ జ‌రుగుతాయి. టీఆర్ ఎస్‌లో ఉన్న ఒక సినిమా స్టార్‌కి మ‌ళ్లీ అవకాశం ఇవ్వ‌లేదు కేసీఆర్‌. సిట్టింగ్ ఎమ్మేల్యే బాబూమోహ‌న్‌కి మ‌ళ్లీ ఆంధోల్ నుంచి టికెట్ ఇవ్వ‌లేదు. ఒక‌పుడు టీఆర్ ఎస్‌లో ఉన్న సూప‌ర్‌స్టార్ విజ‌యశాంతి కూడా నాలుగేళ్లు సైలెంట్‌గా ఉన్నారు. మ‌రి ఆమె ఇపుడు రంగంలోకి దిగుతారా?

విజ‌య‌శాంతి ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్‌కి ఆమె స్టార్ క్యాంపెయ‌న‌ర్ కావ‌డం గ్యారెంటీ. ఐతే ఆమె ఇపుడు బ‌రిలోకి దిగి కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తారా? ఒక‌వేళ ఆమె రెడీ అన్నా..కాంగ్రెస్‌లో ఉన్న అనేక మంది ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులు ఆమెకి స‌ముచిత స్థానం ఇస్తారా?

స్వీయ త‌ప్పుల‌తో రాజ‌కీయ కెరియ‌ర్‌ని గంద‌ర‌గోళంలో ప‌డేసుకున్న రాముల‌మ్మ నిర్ణ‌యం ఏంటనేది చూడాలి.