డ‌బుల్ సిమ్ క‌థ ఇదేనా?

What is the story line of iSmart Shankar
Tuesday, February 12, 2019 - 23:00

ఒక ఎపిసోడ్ లో హీరో గతం మరిచిపోతాడు.. మరో ఎపిసోడ్ లో అన్నీ గుర్తొస్తాయి. ఇలాంటి స్టోరీలైన్లు తెలుగు సినిమాకు కొత్తకాదు. పూరి తీస్తున్న "ఇస్మార్ట్ శంకర్"లో కూడా ఇవే ఛాయలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. డబుల్ దిమాక్, డ్యూయల్ సిమ్ అనే హ్యాష్ ట్యాగ్స్ అందుకే అనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇందులో కొత్త‌ద‌నం లేదా అంటే ఉంది. ఆ కొత్త పాయింట్‌, ఆ ట్విస్ట్ ఏంట‌నేది సినిమాలోనే చూడాలి. 

రొటీన్ పాయింట్ అయితే రామ్ ఒప్పుకోడు క‌దా. అంతేకాదు, రామ్ మొద‌టి సారి ప‌క్కా హైద‌రాబాద్ స్లాంగ్‌లో డైలాగ్‌లు చెప్ప‌నున్నాడు. అది కూడా నావాల్టీనే క‌దా. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, సినిమా మొత్తం పూరీ స్టయిల్ లోనే ఉన్నప్పటికీ.. క్లైమాక్స్ లో మాత్రం టెంపర్ స్టయిల్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంటుందని చెబుతున్నారు.

అన్న‌ట్లు ఈ డ‌బుల్ సిమ్ హీరోకి డ‌బుల్ హీరోయిన్లున్నారు ఇందులో. ఒక భామ న‌భా న‌టేష్‌. మ‌రో సుంద‌రి నిధి అగ‌ర్వాల్‌.