అభిమానుల కోసం పవర్‌స్టార్ ఏం చేస్తాడు?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఏమైనా చేస్తామంటారు ఆయన అభిమానులు. అంత అభిమానం ఉంది వారికి. అందులో డౌట్ పడాల్సిందేమీ లేదు. అభిమానుల కోసం పవర్‌స్టార్ చేస్తున్న సినిమాలు మాత్రం వారిని ఆకట్టుకోలేకపోతున్నాయి. మొదట సర్దార్ గబ్బర్‌సింగ్ నిరాశపర్చింది. ఆ తర్వాత కాటమరాయుడు దెబ్బకొట్టింది. ఇపుడు అజ్ఞాతవాసి. వరుసగా మూడు సినిమాలు పవర్‌స్టార్ అభిమానులని డీలాపర్చాయి.
త్వరలోనే పవర్‌స్టార్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగుతున్నాడు. దానికి ముందు ఒక ఊపు వచ్చే సినిమా కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదు. మరి పవర్‌స్టార్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు? ఎవరి డైరక్షన్‌లో నటిస్తాడు? లేదంటే ఇక సినిమాలు చేయనని చెపుతాడా? ఇపుడు ఇవే ప్రశ్నలు అందరిలో మెదలుతున్నాయి. పవర్‌స్టార్ స్వయంగా స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు.
పవన్ కల్యాణ్ ఈ సినిమా చేయబోతున్నాడని, అది ఒప్పుకున్నాడనీ, ఊహాగానాలు ఎలా ఉన్నా... త్వరలోనే పవర్‌స్టార్ ఈ విషయంలో స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఇకపై నాన్చే ఛాన్స్ లేదు.
- Log in to post comments