పవన్ కళ్యాణ్ మళ్ళీ సెల్ఫీ తీసుకుంటాడా?
కాటమరాయుడు సినిమా ఈవెంట్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి మెరిసారు. ఆ తర్వాత మళ్లీ ఇపుడు సైరా ఈవెంట్‌లో అన్నయ్య, తమ్ముడు ఒకే వేదిక నుంచి అభిమానులను పలకరించనున్నారు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కనీవినీ ఎరుగని రీతిలో జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ అన్నీ ఒకెత్తు, ఇది మరో ఎత్తు అన్నట్లుగా నిర్వహించాలని రామ్‌చరణ్ నిర్వాహకులకి తెలిపారు. ఐతే.. అంత కొత్త దనం ఏమీ ఉండబోతుందో చూడాలి.
అభిమానులకి మాత్రం...పవర్‌స్టార్, మెగాస్టార్ కలవడమే పెద్ద విశేషం. ఈ ఈవెంట్‌కి జనసేనాని ముఖ్య అతిథిగా వస్తున్నాడనేది పాత న్యూసే. ఐతే వీరిద్దరూ ఈ వేదికపై నుంచి అభిమానులతో సెల్ఫీ తీసుకుంటారా? ఆ మధ్య పవర్‌స్టార్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చిన చిరుతో పవర్‌స్టార్ ఇలా సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత అదొక ట్రెండ్‌గా మారింది. ఇటీవల వాల్మీకీ ఈవెంట్‌లోనూ దర్శకుడు హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కలిసి అభిమానుల బ్యాక్‌డ్రాప్‌లో సెల్ఫీ తీసుకున్నారు.
ఇపుడు సైరా ఈవెంట్‌లోనూ గ్రాండ్ స్టేడియం అంతా కవర్ అయ్యేలా మెగా సెల్ఫీ తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.
- Log in to post comments