"ప్రస్తుతానికి ఏ సినిమా చేసే ఆలోచన లేదు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడతాను," అని ఖరాఖండీగా తేల్చి చెప్పారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. అజ్ఞాతవాసి తర్వాత ఆయన చేసే సినిమా ఏంటనే విషయంలో ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. వాటన్నింటికి తాళం వేశారు ఒక్క ప్రెస్‌మీట్‌తో. సోమవారం సాయంత్రం కరీంనగర్‌లో ఆయన విలేకర్లతో ముచ్చటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసేన పార్టీని ఎలా సంస్థాగతంగా డెవలప్ చేయనున్నారో, తమ పార్టీ లక్ష్యాలేంటో వివరించారు పవర్‌స్టార్.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఏమైనా చేస్తామంటారు ఆయన అభిమానులు. అంత అభిమానం ఉంది వారికి. అందులో డౌట్ పడాల్సిందేమీ లేదు. అభిమానుల కోసం పవర్‌స్టార్ చేస్తున్న సినిమాలు మాత్రం వారిని ఆకట్టుకోలేకపోతున్నాయి. మొదట సర్దార్ గబ్బర్‌సింగ్ నిరాశపర్చింది. ఆ తర్వాత కాటమరాయుడు దెబ్బకొట్టింది. ఇపుడు అజ్ఞాతవాసి. వరుసగా మూడు సినిమాలు పవర్‌స్టార్ అభిమానులని డీలాపర్చాయి.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎపుడూ సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంటారు. కొత్త సంవత్సరం తొలి రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో జనసేన అధినేత గంటన్నర సేపు భేటీ కావడం అతిపెద్ద సర్‌ప్రైజ్. ఈ భేటి ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
కేసీఆర్‌తో పవర్‌స్టార్‌కి ఇంతకుముందు ప్రత్యేకమైన స్నేహబంధం లేదు. గత ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగానే ప్రచారం చేశారు పవర్‌స్టార్. ఐతే ఇపుడు సడెన్‌గా కలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అసలు పవన్ కల్యాణ్ కేసీఆర్‌ని ఎందుకు కలిశారు? అసలు రీజన్ ఏంటి
చిరంజీవి బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అంటే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కి పడదు. అన్నయ్య చిరంజీవితో పూర్తిగా కలిసిపోయినా...అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ని పూర్తిగా దూరం పెట్టారు పవర్‌స్టార్. ఆ విషయం మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా పవర్‌స్టార్ రాజమండ్రిలో తన పార్టీ కార్యకర్తలతో సుదీర్ఘంగా మాట్లాడారు. జనసేనలోకి ఎలాంటి వారిని తీసుకుంటానో, ఎలాంటి వారిని తీసుకోలేనో వివరంగా చెప్పారు.
పవన్ కల్యాణ్ యూరోప్ నుంచి వచ్చి రాగానే తన జనసేన పార్టీ నేతలతో కలిసి ముచ్చటించారు. లండన్‌లో గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం, అక్కడ ప్రముఖులు తన ఆలోచనలను, సైద్దాంతికతకి మద్దతు తెలపడం గురించి జనసేనాని వారికి వివరించారు. ప్రస్తుతం జనసేన పార్టీపై పూర్తిగా ఫోకస్ నిలిపారు పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తికాగానే పవన్ జనసేనకి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెడుతారు.
ఎమ్మెల్యే కావాలనేది కమెడియన్ అలీ డ్రీం. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా ఉన్నాడు. ఇపుడు పవర్‌స్టార్‌తోనే రాజకీయ ప్రయాణం చేయనున్నాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అలీ, పవర్‌స్టార్ ఫ్రెండ్సిప్ ఈనాటిది కాదు. పవన్ కల్యాణ్ కెరియర్ ప్రారంభం నుంచి అలీ ఆయనతో స్నేహంగా ఉంటున్నాడు. అలీ లేకుండా సినిమా ఎలా చేస్తాను అని ఆ మధ్య ఒక ఈవెంట్‌లో సరదాగా చెప్పాడు పవన్ కల్యాణ్. అంతటి స్నేహబంధం వారిది. అందుకే జనసేన పార్టీ తరఫున రాజమండ్రి అసెంబ్లీ సీటుని జనసేన అధినేత అలీకి ఇస్తానని ప్రామిస్ చేశాడట.