గోల్మాల్ శివాజీరాజా!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో విభేదాలు రచ్చకెక్కాయి. మా అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్.. ఇద్దరూ మీడియా ముందుకొచ్చి ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. ఆరోపణలు చేసుకున్నారు. శివాజీరాజాది గోల్మాల్ వ్యవహారమే అంటున్నాడు నరేష్.
నిజంగా శివాజీరాజా ఎలాంటి అక్రమాలకి పాల్పడకపోతే విచారణకి ఎందుకు అంగీకరించడం లేదని అడుగుతున్నాడు నరేష్. ‘మా’ అధ్యక్షుడిగా శివాజీరాజా చేసిన గోల్మాల్ వల్లే ఇంత సీన్ క్రియేట్ అయిందంటున్నాడు.
తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని తెలిపాడు నరేష్. తన ఫోన్ కాల్స్‌ని కూడా రిసీవ్ చేసుకోవడం లేదనీ, అందుకు సంబంధించిన కాల్, మెసేజ్ డాటాను బయటపెట్టాడు నరేష్. వీళ్లని నమ్మి మోసపోయాను అని ఘాటుగా చెప్పాడు నరేష్. వీళ్ళని నమ్మి మహేష్‌బాబుని కూడా అమెరికా వచ్చేందుకు ఒప్పించానని చెప్పాడు.
శివాజీరాజా, ఆయన టీమ్ అంతా మొన్నామధ్య అమెరికాకి బిజినెస్ క్లాస్‌లో వెళ్లి ఎంజాయ్ చేశారని అన్నాడు నరేష్. నిజాలు నిర్భయంగా మాట్లాడుతాను కాబట్టే తనను దూరం పెడుతున్నారని ఆరోపించాడు. మాలో చోటుచేసుకున్న ఈ వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో నిజనిర్ధాణ కమిటీ వేయాలని తాను చెప్పానని.. కానీ శివాజీరాజా మాత్రం అందుకు అంగీకరించడం లేదంటున్నాడు నరేష్.
- Log in to post comments