మాలో అంతా గప్‌చుప్

మొన్నటి వరకు తిట్టుకున్న నరేష్, శివాజీరాజీ ఇపుడు రాజీపడ్డారు. రాజీపడ్డారు అనడం కన్నా రాజీ పడేలా చేశారు అనడం కరెక్ట్. మా అసోషియేషన్ 25 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా నిర్మాతలు కలగచేసుకొని సమస్యని సాల్వ్ చేశారు. కలెక్టివ్ కమిటీ అనే ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో పేరొందిన నిర్మాతలు మా సమస్యని పరిష్కరించారు. మా నిధులన్నీ గోల్‌మాల్ చేశాడని శివాజీరాజీపై ఆరోపణలు వచ్చాయి.
ఐతే ఈ కమిటీ ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చి చెప్పింది. ఈ వివాదం ఇంతటితో ముగిసిందని ప్రకటించింది. కానీ అసలు మేటర్ ఏంటంటే..శివాజీరాజా అండ్ కో చేసిన తప్పులు బయటపడ్డాయి. ఐతే మరింతగా పరువు పోకూడదని రాజీ కుదర్చారు. ఇకపై మా అధ్యక్షుడిగా శివాజీరాజా పాత్ర పరిమితంగా ఉంటుంది. అధ్యక్షుడు ఆయనే కానీ పని ఇతరులు చేస్తారు.
ఇక పెత్తనం అంతా నరేష్‌దే. మరి నరేష్ చేతిలోకి కీ వచ్చింది కాబట్టి త్వరలో జరగబోయే అమెరికా ఈవెంట్‌కి మహేష్‌బాబు వస్తాడా? అనేది చూడాలి.
- Log in to post comments