అనగనగా ఇటలీలో ఒక పాట!

"అరవింద సమేత" సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఒక పాట చిత్రీకరణ, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని చాలా స్పీడ్‌గా పూర్తి చేశారు. రెగ్యులర్ షూటింగ్‌ని ఏప్రిల్‌లో మొదలుపెట్టారు. పెద్ద హీరో సినిమాని ఆరు నెలల్లో పూర్తి చేయడం అంటే మాటలు కాదు. ఇది ఇలా సాధ్యమైందంటే ..సినిమా మొత్తాన్ని హైదరాబాద్ స్టూడియోల్లోనూ, పరిసర ప్రాంతాల్లో తీయడం వల్లే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం నాన్‌స్టాప్‌గా పనిచేశాడు. తన తండ్రి హరికృష్ణ కన్నుమూసినా.. సినిమా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో నాలుగో రోజు నుంచి షూటింగ్లో పాల్గొన్నాడు.
ఇక మిగిలిన ఒక పాటని ఇటలీలో తీయనున్నారు. "అనగనగా అరవిందట తన పేరు..అందానికి సొంతూరు" అనే రొమాంటిక్ డ్యూయెట్‌ని ఇటలీలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ఉన్న నాలుగు పాటల్లో కాస్త జోష్ ఉన్న పాట ఇదే. మిగతావన్నీ కథని నడిపించే సిచ్యువేషనల్ సాంగ్స్. అందుకే దీన్ని కలర్ఫుల్గా తీయాలనే ఉద్దేశంతోఇటలీలో తీస్తున్నాడు త్రివిక్రమ్ఈ. పాటతో ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయి.
సినిమాని అక్టోబర్ 11న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Log in to post comments