అత్త బాట‌లో స‌మంత‌!

Samantha and Naga Chaitanya welcome munchkin puppy
Thursday, November 8, 2018 - 17:30

నాగ చైత‌న్య‌, స‌మంత గ‌త అక్టోబ‌ర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఏడాది తిర‌గ్గానే వారు త‌ల్లితండ్రుల‌య్యారు. ఐతే వారు పేరెంట్స్ అయింది ఒక పప్పీకి. వారింట్లో ఈ ప‌ప్పికి రాచ‌మ‌ర్యాద‌లు మొద‌ల‌య్యాయి. ఈ ఆనందాన్ని స‌మంత ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసుకొంది.

ఆ ప‌ప్పీ ఫోటోని, దాన్ని చాలా అభిమానంగా చూస్తున్న చైత‌న్య‌, స‌మంత‌ల ఫోటోని ఆమె షేర్ చేసింది. చూస్తుంటే.. స‌మంత కూడా జంతు ప్రేమికురాలు అనిపిస్తోంది. స‌మంత అత్త అమ‌ల‌..దేశంలోనే పేరొందిన జంతు ప్రేమికురాలు, సంర‌క్ష‌కురాలు. బ్లూక్రాస్ పేరుతో ఆమె ఒక సంస్థ‌నే న‌డుపుతోంది.

అత్త‌కి త‌గ్గ కోడ‌లు అనిపించుకుంటోంది స‌మంత‌.

అన్న‌ట్లు చైత‌న్య‌, స‌మంత ఇపుడు ఒక సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారు. పెళ్ల‌యిన త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి మూవీ ఇదే. శివ నిర్వాణ (నిన్ను కోరి ఫేమ్‌) ద‌ర్శ‌క‌త్వంలో వీరు క‌లిసి న‌టిస్తున్నారు. ఈ సినిమా చైత‌న్య కెరియ‌ర్‌కి కీల‌కం. వ‌రుస‌గా మూడు ఫ్లాప్‌లు ఇచ్చాడు చైతూ.

|

Error

The website encountered an unexpected error. Please try again later.