నంద‌మూరి హ‌రికృష్ణ కూతురు ప్ర‌క‌ట‌న‌

Nandamuri Harikrishna's daughter as Kukatpally TDP candidate
Thursday, November 15, 2018 - 23:15

రాజ‌కీయ ప‌రిశీలకులు ఊహించిన‌ట్లే.. నంద‌మూరి హ‌రికృష్ణ కూతురిని ఎన్నిక‌ల బ‌రిలోకి దింపుతోంది తెలుగుదేశం పార్టీ. హ‌రికృష్ణ కూతురు సుహాసిని పేరుని కూక‌ట్‌ప‌ల్లి అభ్య‌ర్థిగా ఆ పార్టీ గురువారం రాత్రి అధికారికంగా ప్ర‌క‌టించింది. నంద‌మూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న తొలి వ్య‌క్తిగా సుహాసిని నిల‌వ‌నున్నారు. ఆమె మామ చుండ్రు శ్రీహ‌రి మాజీ ఎంపీ. 

కూక‌ట్‌ప‌ల్లి నుంచి మొద‌ట పెద్దిరెడ్డి పేరుని ఫైన‌ల్ చేశారు. ఐతే చివ‌రి నిమిషంలో నంద‌మూరి హ‌రికృష్ణ కూతురిని బ‌రిలోకి దింపాల‌ని నిర్ణ‌యించింది తెలుగుదేశం పార్టీ.  ఇక్క‌డ గెలిస్తే...తెలంగాణ‌లో పార్టీ వ్య‌వ‌హారాలు ఇక‌పై ఆమె చూసుకునే అవ‌కాశం ఉంద‌ట‌. 

మ‌రి సోద‌రిని గెలిపించేందుకు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్ ప్ర‌చార బ‌రిలోకి దిగుతారా అన్న‌ది చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై క‌ల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్ స్పందించ‌లేదు. ఐతే బాల‌య్య మాత్రం ఈ నెల 25 నుంచి తెలుగుదేశం పార్టీ త‌రఫున ప్ర‌చారం చేసేందుకు రెడీ అవుతున్నారు. కూక‌ట్‌ప‌ల్లిలోనూ సుహాసిని కోసం ప్ర‌చారం నిర్వ‌హిస్తారు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.