తిరుపతిలో డీజే భజే భజే

తిరుమల తిరుపతి దేవుణ్ని దర్శించుకొన్నాడు అల్లు అర్జున్. ఎల్లుండి విడుదల కానున్న తన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నాడట. తన ప్రతి సినిమా విడుదలకి ముందు తిరుమల వెంకటేశ్వురుడిని నిర్మాత దిల్‌రాజు దర్శించుకుంటాడు. ఆయన శ్రీవెంకటేశ్వరస్వామి భక్తుడు. ఆయన బ్యానర్ పేరు కూడా అదే. ఈసారి తనతో పాటు బన్నిని కూడా తిరుమలకి తీసుకెళ్లాడు.
"దువ్వాడ జగన్నాధం సూపర్ హిట్ కావాలి అని తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నాము. బ్రాహ్మణ సంఘాల అనుమానాలన్నింటిని నివృత్తి చేశాం. అభ్యంతరాలన్నీ తొలగి పోయాయి," అని నిర్మాత దిల్ రాజు విలేకర్లకి తెలిపాడు. అంతేకాదు సినిమాలో బన్ని డ్యాన్స్‌లు అదిరిపోతాయన్నాడు.
"అల్లు అర్జున్ తన యాక్షన్, డ్యాన్స్ లతో అభిమానులను అలరిస్తాడు. ఖచ్చితంగా సినిమా ఘనవిజయం సాధిస్తుంది. అందులో డౌట్‌లేద,"న్నాడు. ఇది దిల్‌రాజుకి నిర్మాతగా 25వ చిత్రం. దాంతో ఆయన ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు నిర్వహించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రిమియర్ షో వేయడం లేదని తెలిపాడు దిల్‌రాజు.
- Log in to post comments