ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేణుమాధవ్

కమెడియన్ వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఐతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేట్‌గా నిర్ణయం తీసుకున్నాడో లేదో పార్టీ అతనికి టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ ఇపుడు బరిలో నిలిచాడు. సొంత ఊరు అయిన కోదాడలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు వేణుమాధవ్.
మూడు రోజుల క్రితమే నామినేషన్ వేశాడు కానీ వేణుమాధవ్ తగిన పత్రాలు సరిగా లేవని వాటిని అధికారులు తిరస్కరించారు. దాంతో నామినేషన్లకి చివరిరోజైన సోమవారం తన మద్దతు దారులతో మరోసారి వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పూర్తి సెట్ అందించాడు. నామినేషన్ వేశాడు.
టీడీపీలో ఉండి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం ఏంటని అడిగితే సమాధానం ఇవ్వలేదు. కోదాడలో కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి భార్య పోటీ చేస్తున్నారు. మహాకూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.
- Log in to post comments