ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బాలకృష్ణ రిక్వెస్ట్‌

Adarsh Balakrishna gives clarification about NTR Jr
Wednesday, August 8, 2018 - 20:30

జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులను వేడుకుంటున్నాడు యువ  నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. బిగ్‌బాస్ షోలో పాల్గొని, ఆ త‌ర్వాత దాని నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఆద‌ర్శ్ బాల‌కృష్ణకి ఎన్టీఆర్ అభిమానుల నుంచి స‌మ‌స్య మొద‌లైంది.

ఇటీవ‌ల ‘అరవింద సమేత వీర రాఘవ’ షూటింగ్‌లో పాల్గొన్నాడు ఆదర్శ్‌. ఈ సినిమాలో ఆద‌ర్శ్‌ది అతిథి పాత్ర‌. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న‌ సినిమాలో తాను చిన్న పాత్ర‌ చేసిన ఆనందంలో ట్విట్ట‌ర్‌లో ఒక పోస్ట్ చేశాడు. ఒక ఫోటో కూడా షేర్ చేశాడు. ఫోటోతో స‌మ‌స్య రాలేదు కానీ ఆ పోస్ట్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి గౌర‌వం ఇవ్వ‌లేద‌ని  అభిమానుల‌కి కోపం వ‌చ్చింది.

త్రివిక్ర‌మ్‌ని సార్ అని గౌర‌వంగా సంభోదించిన ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌.. ఎన్టీఆర్‌కి మాత్రం సార్ అని కానీ, గారు అని కానీ, బ్ర‌ద‌ర్ అని కానీ ఏమీ పెట్ట‌లేదు తార‌క్ పేరు ప‌క్క‌న‌. దాంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. విష‌యం సీరియ‌స్‌గా మారుతుండ‌డంతో ఇపుడు క్లారిటీ ఇస్తూ మ‌రో ట్వీట్ చేశాడు ఆద‌ర్శ్‌.  తారక్‌ తనకు ఎప్పటికీ అన్నయ్యే అని ట్వీట్‌ చేశాడు.

త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ని కాపీ చేసి నేరుగా ట్విటర్‌లో పోస్ట్ చేయ‌డం వ‌ల్లే ఈ స‌మస్య వ‌చ్చింద‌ని క్లారిఫికేష‌న్ ఇచ్చాడు.