ఆకు చాటు పిందె త‌డ‌వ‌డం ఖాయం!

Akuchatu Pinde Tadiche to be shot on Rakul and Balakrishna
Tuesday, October 9, 2018 - 09:30

"ఆకు చాటు పిందె త‌డిసే.." అనే పాట ఎంత పాపుల‌రో చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్‌, శ్రీదేవిల‌పై చిత్రీక‌రించిన ఈ రొమాంటిక్ వాన పాట అప్ప‌ట్లో జ‌నాల్ని ఉర్రూత‌లూగించింది. ఈ పాటని మ‌ళ్లీ తీయ‌నున్నారు. వ‌చ్చే వార‌మే షూటింగ్‌. బాలయ్య‌, ర‌కుల్‌పై ఈ పాట‌ని మ‌ళ్లీ తీయ‌నున్నారు. ఇదంతా ఎన్టీఆర్ బ‌యోపిక్ కోస‌మే.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ్రీదేవి పాత్ర‌ని ర‌కుల్ పోషించ‌నుంద‌నేది ఓల్డ్‌న్యూస్‌. ఐతే షూటింగ్ తేదీలు ఇపుడు క‌న్‌ఫ‌మ్ అయ్యాయి. వ‌చ్చే వార‌మే హైద‌రాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో ఎన్టీఆర్ గెట‌ప్‌లో బాల‌య్య‌, శ్రీదేవి అవ‌తారంలో ర‌కుల్ వాన‌లో త‌డుస్తూ  స్టెప్పులేస్తారు. ర‌కుల్ తో బాల‌య్య న‌టించ‌డం ఇదే ప్ర‌థ‌మం.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్ని పాత సినిమాల పాట‌ల‌ను ఉప‌యోగిస్తున్నారో తెలియ‌దు కానీ సంగీత ద‌ర్శ‌కుడు నాలుగు కొత్త పాట‌ల‌ను ఇప్ప‌టికే కంపోజ్ చేశాడ‌ట‌.