సునీల్‌, న‌రేష్‌...సిల్లీ ఫెలోస్‌

Allari Naresh and Sunil as 'Silly Fellows'
Tuesday, March 20, 2018 - 11:30

సునీల్ కామెడీ వేషాల్లోకి వ‌చ్చాడు. ఫుల్ లెంగ్త్ హీరో పాత్ర‌లతో గట్టిగా దెబ్బ త‌గ‌ల‌డంతో ఇపుడు కామెడీ వేషాల‌తో పాటు ఇద్ద‌రు హీరోల సినిమాల్లో ఒక పాత్ర పోషించ‌డం వంటివి చేస్తున్నాడు. తాజాగా భీమ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేస్తున్నాడు. ఇందులో మెయిన్ హీరో అల్ల‌రి న‌రేష్‌. ఐతే న‌రేష్ మెయిన్ హీరో, సునీల్ సెకండ్ హీరో అని కాకుండా ఇది మ‌ల్టీస్టార‌ర్ అని చెపుతోంది టీమ్‌.

ఈ సినిమాకి సిల్లీ ఫెలోస్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా జూన్‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమాకి సంబంధించి.. ఈ ఇద్ద‌రి హీరోల‌కి ప్ల‌స్ ద‌ర్శ‌కుడు భీమ‌నేనికి హిట్ కావాలి. ముగ్గురూ ఈ సినిమాతో ద‌శ తిరుగుతుంద‌ని ఆశ‌ప‌డుతున్నారు. 

ఇక‌ గ‌తేడాది టూ కంట్రీస్ సినిమా విడుద‌లైన త‌ర్వాత సునీల్ ఇక హీరో వేషాల‌కి కామా పెట్టాల‌నుకొన్నాడు. ఈ ఏడాది సునీల్ త్రివిక్ర‌మ్ కొత్త సినిమాలోనూ, శ్రీనువైట్ల - ర‌వితేజ సినిమాలోనూ కామెడీ పాత్ర‌లు పోషించ‌నున్నాడు.