విద్యాకి ప‌ట్టు చీర ఇచ్చిన బాల‌య్య ఫ్యామిలీ

Balayya family present silk saree to Vidya Balan
Wednesday, July 18, 2018 - 13:45

బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. ఆమె తొలి చిత్రం.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌య్య త‌న తండ్రి ఎన్టీఆర్‌గా న‌టిస్తుండ‌గా, ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ క‌నిపిస్తుంది. బుధ‌వారం (జులై 18) నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొంటోంది. ముంబై నుంచి హైద‌రాబాద్‌కి వ‌చ్చిన విద్యాబాల‌న్‌ని బాల‌య్య కుటుంబ స‌భ్యులు సాదారంగా ఆహ్వానించారు. ఆమెకి బ‌స‌వ‌తార‌కం వ్య‌క్తిత్వం, ఆమె న‌డ‌క‌, న‌డ‌త గురించి పూర్తిగా వివ‌రించారు. అంతేకాదు, ఆమెకి ఒక అంద‌మైన ప‌ట్టుచీర‌ని బ‌హుక‌రించారు.

బాల‌య్య చిన్న కూతురు తేజ‌స్విని, ఆయ‌న భార్య వ‌సుంధ‌రా దేవి విద్యాకి ఈ ప‌ట్టుచీర‌ని అందించారు. బాల‌య్య కుటుంబ స‌భ్యుల మ‌ర్యాద‌కి, అభిమానానికి విద్యాబాల‌న్ ఫిదా అయింద‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు. విద్యాబాల‌న్‌కి గ‌తంలోనూ తెలుగులో చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి కానీ అపుడు ఆమె అంగీక‌రించ‌లేదు.

ఐతే ఎన్టీఆర్ గురించి అంద‌రికీ తెలుసు కానీ బ‌స‌వ‌తార‌కం గురించి అంత‌గా తెలియ‌దు. ఎన్టీఆర్ వంటి ఒక మ‌హాశ‌క్తి వెనుక‌న్న మ‌హిళామూర్తి గురించి ప్ర‌పంచానికి త‌న పాత్ర ద్వారా తెలుస్తుంద‌నే ఉద్దేశంతోనే ఈ సినిమా ఒప్పుకున్నాన‌ని విద్యా అంటోంది.