'ప‌క్క'దారి ప‌డుతున్న తార‌ల ర‌చ్చ

Bandla Ganesh and Roja's ugly disco
Wednesday, December 13, 2017 - 16:15

ఇటీవ‌ల తెలుగు సినిమా హీరోయిన్లు (వ‌ర్ధ‌మాన తార‌లు), రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న తార‌లు... సినిమా వాళ్ళ ప‌రువును బ‌జారుకీడుస్తున్నారు. కొళాయి (న‌ల్లా) ద‌గ్గ‌ర కొట్టుకునే స్థాయికి చ‌ర్చ‌ల‌ను తీసుకొచ్చారు. ఈ మ‌ధ్య ఏ భామ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చినా...అందులో క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ మెయిన్ హైలెట్ అవుతుంది. ఆ ఇంట‌ర్వ్యూ బిట్స్‌ని ఇత‌ర చానెల్స్ మరింత స్పైస్‌ని జోడిస్తూ య‌థేచ్చ‌గా వాడుకుంటున్నాయి. ఫ‌లానా ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌న‌ని "ప‌క్క‌లోకి ర‌మ్మన్నాడు" అని థంబ్ నెయిల్ ఇమేజీల‌తో వ్యూస్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఇదొక ప్ర‌హ‌సనం.

ఇక మంగ‌ళ‌వారం నిర్మాత బండ్ల గ‌ణేష్‌, వైఎస్సార్సీ నాయ‌కురాలు రోజా మ‌ధ్య సాగిన సంవాదం పూర్తిగా పక్క‌దారి ప‌ట్టింది. వార‌స‌త్వ రాజ‌కీయాల గురించి డిస్క‌ష‌న్ పాయింట్. బండ్ల గ‌ణేష్ మెగా ఫ్యామిలీలోని వార‌సుల రాక‌ని స‌మ‌ర్ధించే బాధ్య‌త తీసుకున్నాడు. రోజా వైఎస్సార్ కుమారుడు జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని డిఫెండ్ చేసే బాధ్య‌త తీసుకున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు ఓకే. కానీ స‌డెన్‌గా వీరి చ‌ర్చ‌ని పూర్తిగా 'ప‌క్క‌'కి త‌ప్పించారు.

బండ్ల గ‌ణేష్ ప‌క్క‌లు వేసే వ్య‌క్తిగా రోజా త‌నకి అల‌వాటైన ప‌ద్ద‌తిలో వ్యాఖ్యానించారు. బండ్ల కూడా రోజా ఎలా సైడ్ రూట్‌లో పైకి వ‌చ్చిందో అంటూ కామెంట్ చేశాడు. ఇపుడు సినిమా ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ ప‌ద్ద‌తితోనే అంద‌రూ ఎద‌గుతార‌న్న నిర్ణ‌యానికి జ‌నం వ‌చ్చేలా యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలు, ఇలాంటి టీవీచ‌ర్చ‌లు సాగుతున్నాయి. సో శాడ్‌!