చార్మి అందుకే భయపడుతోందా!

కోర్టుకి వెళ్లినా పెద్దగా ఉపయోగం దక్కలేదు చార్మికి. కోర్టులో కేసు వేస్తే సిట్‌ని ఇరుకున పెట్టొచ్చు అని కొందరు ఆమెని తప్పుదోవ పట్టించారట. అయితే ఆమె నుంచి బలవంతంగా రక్త నమూనాలు, గోళ్లు, జుట్టు సేకరించొద్దన్న కోర్టు ఆదేశం మినహా ఆమె పెద్దగా సాధించింది ఏమీ లేదు. ఈ విషయంలో సిట్ మొదటి నుంచే అదే వాదన చేస్తోంది. సెలబ్రిటీలు ఒప్పుకోకపోతే శాంపుల్స్ తీసుకోమని చెపుతోంది. సో కోర్టు వల్ల ఆమెకి వచ్చిన ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏమీ లేదు.
పైగా ఈ చర్య వల్ల ఆమె నిజంగానే డ్రగ్స్ తీసుకుందేమో, అందుకే శాంపుల్స్ ఇవ్వడానికి వెనుకాడుతుందేమో అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది. కేసు విచారణ ఎదుర్కొంటే తనకి పెళ్లి కాదు అన్న ఆమె వాదన కూడా నవ్వుల పాలైంది. మొత్తమ్మీద చార్మి కోర్టుకి వెళ్లడం ద్వారా అభాసుపాలు కావడం మినహా సాధించింది ఏమీ లేదు.
- Log in to post comments