డ్ర‌గ్స్ కేసు: అలోవిరా తాగుతున్నార‌ట‌!

Drugs Case: Are Tollywood celebrities taking aloe vera juice
Tuesday, July 25, 2017 - 18:00

డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ తార‌ల విచార‌ణ రోజు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. కాజల్ మేనేజ‌ర్ రోని ప‌ట్టుబ‌డ‌డ‌మే ఒక పెద్ద మ‌లుపు. హైకోర్టు నుంచి చార్మి పెద్ద‌గా ఉప‌శ‌మ‌నం పొంద‌క‌పోవ‌డం ఒక కీల‌క ప‌రిణామామే. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ట‌. విచార‌ణ‌కి హాజ‌ర‌వుతున్న తార‌లు, మ‌రికొంద‌రు అనుమానితులు అలోవిరా జ్యూస్ సేవించి విచార‌ణ‌కి హాజ‌ర‌వుతున్నార‌ని సిట్ అనుమానిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు కానీ అలోవిరా జ్యూస్ తాగితే డోపింగ్ టెస్ట్ వంటి వాటి నుంచి ఈజీగా బ‌య‌ట‌ప‌డొచ్చ‌నే ప్ర‌చారం చాలా కాలంగా ఉంది.

తాజాగా ఎక్సైజ్ శాఖ విచార‌ణ‌లో సెల‌బ్రిటీల అరెస్ట్‌లు లేక‌పోవ‌డంతో... ఈ కేసుకి సంబంధించి ఆధారాల విష‌యంలో బ్రేక్ థ్రూ సాధించ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంద‌న్న వాద‌న మొద‌లైంది. ర‌క్త‌ప‌రీక్ష‌లో ఎటువంటి డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు దొర‌కకుండా సెల‌బ్రిటీలు అలోవిరా జ్యూస్ తాగుతున్నారా అని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు మీడియా వార్త‌లు. మ‌రి ఇందులో నిజ‌మెంతో?