హోదా కోసం గ‌డ్డం క‌ట్‌

K Raghavendra Rao shaves off beard for Special Status for AP
Monday, April 9, 2018 - 15:00

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు అన‌గానే తెల్లగ‌డ్డంతో కూడిన రూపం గుర్తొస్తుంది. ఎపుడూ గ‌డ్డంతోనే ఉంటారాయ‌న‌. ఐతే ఇపుడు ద‌ర్శ‌కేంద్రుడు త‌న గడ్డాన్ని ప్ర‌త్యేక హోదాకి అర్పించారు. హోదా వ‌చ్చేలా చేయ‌మ‌ని  తిరుప‌తి వెంక‌టేశ్వ‌రుడిని మొక్కుకున్నారాయ‌న‌.

సాధార‌ణంగా మొక్కు తీరిన త‌ర్వాత త‌ల‌నీలాలు స‌మ‌ర్పిస్తారు భ‌క్తులు. ద‌ర్శ‌కేంద్రుడు మాత్రం ముందే స‌మ‌ర్ప‌యామి అన్నారు. ఇది రివ‌ర్స్ మొక్కు.  ప్రత్యేకహోదా పోరాటంలో ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని,  త్వరలోనే రాష్ట్ర ప్రజలు శుభవార్త వింటారనే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. సోమ‌వారం (ఏప్రిల్ 9న‌) ఆయ‌న త‌న గ‌డ్డాన్ని అర్పించారు.

నలభై ఏళ్లుగా గడ్డాన్ని స్వామివారికి సమర్పిస్తున్నానని, ఈసారి హోదా కోసం గడ్డం ఇచ్చాన‌ని తెలిపారు.