నన్ను ఎవరూ వేధించలేదు

80, 90లలో ఖుష్బూ ఓ రేంజ్‌లో వెలిగింది. తమిళనాట ఐతే ఏకంగా ఆమెకి అప్పట్లో గుడికట్టారు. ఆమెకి అంతగా అభిమానులుండేవారు. టీనేజ్‌లోనే ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఐతే తన 40 ఏళ్ల కెరియర్‌లో ఎపుడూ వేధింపులు ఎదుర్కొలేదంటోంది. ఇపుడు ఇండియా అంతా మీటూ ఉద్యమం జరుగుతోంది.
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకి గురైన మహిళలు అంతా ఆ విషయాలను బయటపెడుతున్నారు. పలువురు దర్శకులు, నటులు, గాయకుల పరువు పోయింది.
ఈ విషయంలో మీరు ఎందుకు స్పందించడం లేదని ఖుష్బూని ఎవరో అడిగినట్లు ఉంది. దాంతో ఆమె ట్విట్టర్‌లో స్పందించింది. ఆమె ట్విట్టర్‌లో చాలా యాక్టివ్. "వేధింపులు ఎదురుకాలేదా అని అందరూ అడుగుతున్నారు. నిజమే నాకు వేధింపులు ఎదురుకాలేదు. నేను ఎప్పుడూ పోరాటం చేసేదాన్ని, కష్టపడేదాన్ని. పారితోషికం విషయంలోనూ గట్టిగా మాట్లాడేదాన్ని," అంటూ సినిమా పరిశ్రమలో తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పింది.
ఐతే 'మీటూ' ఉద్యమాన్ని హేళన చేసి మాట్లాడుతున్న వారిని మాత్రం ఓ రేంజ్‌లో ఆడుకొంది.
- Log in to post comments