నా లిస్ట్ అంత పెద్దది కాదు: శ్రీరెడ్డి

అందరూ భావిస్తున్నట్లు తాను ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకోలేదంటోంది శ్రీరెడ్డి.
వివాదాలకి మారుపేరుగా మారిన శ్రీరెడ్డి....అవకాశాల కోసం తనని ఎందరో వాడుకున్నారని బయటపెట్టి సంచలనం సృష్టించింది. మొదట ఆమె చేసిన ఆరోపణల్లో, ఆమె ఆవేదనలో కొంత నిజముందనిపించింది. ఐతే ఆ తర్వాత ఆమె చేస్తున్న ఆరోపణలు జుగుప్స కలిగించడం మొదలు పెట్టాయి. ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్న భావన అందరిలో మొదలైంది.
మొదట ఆమెకి అండగా నిలిచిన మహిళాసంఘాలు, మీడియా ఇపుడు దూరంగా ఉంటున్నాయి. ఆమె మాటల్లో నిజాయితీ లేకపోవడం, ఆధారాలు లేని ఆరోపణల కారణంగా ఇపుడు టచ్‌మినాట్ అంటున్నాయి మీడియా సంస్థలు.
హీరో నాని, దర్శకుడు శేఖర్ కమ్ముల, కొరటాల శివ, సురేష్‌బాబు చిన్న కొడుకు, ఇండియన్ ఐడోల్ శ్రీరామ్, సామ్రాట్, రైటర్ కోన వెంకట్.. ఇలా పలువురు పేర్లని బయటపెట్టింది. కొందరు తనని వాడుకున్నారని, కొందరు చాట్ చేశారని చెప్పింది. ఇపుడు కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. లారెన్స్, శ్రీరామ్, మురుగదాస్, సుందర్ సి, సందీప్ కిషన్..అంటూ కొత్త లిస్ట్ అంటూ బయటపెట్టింది.
ఇలా ఆమె డజన్ల కొద్దీ పేర్లు బయటపెడుతుండడంతో అస్సలు ఇండస్ట్రీలో ఆమె అప్రోచ్ కాకుండా మిగిలిన వారి పేర్లు ఏంటో చెప్పు అంటూ ఆమె ఫాలోవర్సే ఆమెని ట్రాల్ చేస్తున్నారు.. దాంతో తన లిస్ట్ పెద్దది కాదు...పేరొందిన చాలా మంది హీరోయిన్లు నోరు విప్పితే మీరు నోరెళ్లబెడుతారు అంటూ కొత్తగా ఇంకో పోస్ట్ వేసింది. శ్రీరెడ్డి ఫేస్‌బుక్ పోస్ట్‌ల్లో నిజానిజాల పక్కన పెడితే ఆమె ఫాలోవర్స్‌కి మాత్రం కావాల్సినంత సరుకు రోజు దొరుకుతోంది.
- Log in to post comments