లైనప్ మార్చేస్తోన్ననాని

"బిగ్‌బాస్ 2" షోతో బిజీగా ఉన్నాడు నాని. ఒకవైపు, ఈ షోలో పాల్గొంటూనే నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ మూవీ "దేవదాసు" షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. సెప్టెంబర్ 28న విడదల కానుంది "దేవదాసు". ఇటు "దేవదాసు" విడుదల, బిగ్‌బాస్ 2 షో..రెండూ ఒకేసారి పూర్తవుతాయి. అంటే అక్టోబర్ నుంచి నాని ఈ రెండు కమిట్‌మెంట్స్ నుంచి ఫ్రీ అవుతాడు. మరి ఆ తర్వాత ఏం చేస్తాడు?
ఇంతకుముందే ప్రకటించినట్లు..నాని "జెర్సీ" అనే కొత్త సినిమా షురూ చేస్తాడు. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. "మళ్లీరావా" సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గౌతమ్ ఈ మూవీకి డైరక్టర్. అక్టోబర్ చివర్లో షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత సినిమాలేంటి?
ఇంతకుముందు నాని ... అవసరాల డైరక్షన్‌లో ఒకటి, తన గురువు ఇంద్రగంటి సినిమా ఒకటి, అలాగే దిల్‌రాజు నిర్మించే "సభకి నమస్కారం" అనే మరోటి ఒప్పుకున్నాడు. ఈ సినిమాలన్నీ ఇపుడు పక్కకి వెళ్లే చాన్స్ ఉంది. ఒక దిల్‌రాజు సినిమా మినహా ఇవన్నీ సైడ్ అవుతాయి. దిల్‌రాజు నిర్మించే మూవీ కూడా వెంటనే ఉండకపోవచ్చు. అలాగే హను రాఘవపూడి సినిమాను కూడా నాని నిలిపివేశాడట.
కొత్త సినిమాలను త్వరలోనే లైనప్ చేయనున్నాడు.
- Log in to post comments