ఎన్టీఆర్ సినిమాకి టైటిల్ రిజిష్ట‌ర్‌

NTR Biopic: Title registered by producers
Friday, October 27, 2017 - 16:15

ఎన్టీ రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా నంద‌మూరి బాల‌కృష్ణ తీయ‌నున్న బ‌యోపిక్‌కి టైటిల్ ఫిక్స్ అయింది. ఎన్టీఆర్ అనే పేరునే టైటిల్‌గా రిజిష్ట‌ర్ చేయించారు. ఒకే ఒక్క‌డు, భార‌త‌ర‌త్న‌, తిరుగులేని మ‌నిషి వంటి పేర్ల‌ను ప‌రిశీలించారు కానీ ఎన్టీఆర్ అనే మూడు అక్ష‌రాల్లోనే అస‌లు ప‌వ‌ర్ ఉంద‌ని అదే టైటిల్‌ని రిజిష్ట‌ర్ చేశారు. నిర్మాత సాయి కొర్ర‌పాటి ఈ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించాడు.

తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ బ‌యోపిక్‌ని నంద‌మూరి బాల‌కృష్ణ‌, విష్ణు ఇందూరి, సాయి కొర్రెపాటి సంయుక్తంగా నిర్మిస్తారు. వారి మూడు బ్యాన‌ర్స్ పాలుపంచుకొంటాయి నిర్మాణంలో.

ఎన్టీఆర్‌గా బాల‌య్యే న‌టిస్తున్నాడు. బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ కూడా ఇందులో న‌టిస్తాడు. అయితే ఇది ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. కీర‌వాణి సంగీతం అందిస్తాడు.