శ్రీదేవి కూతురు వెంట ప‌డుతున్న కెమెరాలు

Paparazzi after Jahnvi Kapoor!
Tuesday, January 9, 2018 - 21:00

శ్రీదేవి కూతురు జాహ్న‌వి హీరోయిన్‌గా రంగ‌ప్ర‌వేశం చేస్తోంది. ఆమె తొలి చిత్రం..ధ‌డ‌క్‌. క‌ర‌ణ్‌జోహ‌ర్ నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోంది ఈ మూవీ.  బాలీవుడ్ మీడియా కెమెరాలు ఇప్ప‌ట్నుంచే ఆమె మీద ఫోక‌స్ నిలిపాయి. ఆమె ఎక్క‌డికి వెళ్లినా వెంట‌ప‌డుతున్నాయి. ప్ర‌శాంతంగా జిమ్‌కి కూడా వెళ్ల‌నివ్వ‌డం లేదు.

ప్ర‌తిరోజూ ఆమె జిమ్‌కి వెళ్తున్న ఫోటోల‌ను పాప‌రాజీ (సెల‌బ్రిటీల వెంట‌ప‌డి ఫోటోలు తీసే కెమెరామెన్‌లు) అప్‌డేట్ చేస్తోంది.

ఇదిగో ఈ ఫోటోలు అలాంటివే.