జాన్విని టార్గెట్ చేసిన శింబు

Simbu wants to rope in Jahnvi Kapoor
Monday, August 6, 2018 - 15:45

త‌మిళ హీరో శింబుది..మ‌న టాలీవుడ్ మంచు మ‌నోజ్‌ది సేమ్ సీన్‌. ఇద్ద‌రికీ హిట్ వ‌చ్చి చాలా కాల‌మే అయింది. ఇద్ద‌రికీ డైర‌క్ష‌న్‌లో వేలు పెట్ట‌డం కామ‌న్ అల‌వాటు. మ‌నోజ్‌కి లేని ఒక అల‌వాటు శింబుకి ఉంది. బాలీవుడ్‌లో ఏ హీరోయిన్ అయినా బాగా క్రేజ్ తెచ్చుకుంటే చాలు ఆమెని సౌత్‌కి తీసుకొచ్చి త‌న సినిమాలో న‌టింప‌చేయాల‌న‌కుంటాడు. మందిరా బేడీ పీక్‌లో ఉన్న‌పుడు మ‌న్మ‌ధ‌లో న‌టింప‌చేశాడు. అది ఒక చిన్న ఉద‌హర‌ణ‌.

శింబు ఇప్పుడు జాన్వీ కపూర్ ని టార్గెట్ చేశాడట‌. శ్రీదేవి కూతురు తొలి సినిమాతోనే సూప‌ర్ పాపుల‌ర్ అయింది. ఆమెని త‌న స‌ర‌స‌న న‌టింప‌చేయాల‌న‌ది శింబు థాట్‌.

ప్ర‌స్తుతం మణిరత్నం సినిమాలో న‌టిస్తున్న శింబు..త్వ‌ర‌లోనే వెంకట్ ప్రభు దర్శకత్వంలో  ఒక మూవీ చేయ‌నున్నాడు. జాన్వీని సౌత్ కి పరిచయం చేసే ప‌నిని మ‌న‌మ చేద్దామ‌ని శింబు వెంక‌ట్ ప్ర‌భుకి చెప్పాడ‌ట‌. ఐతే బోనీక‌పూర్ ఇందుకు ఒప్పుకుంటాడా అనేది డౌటే. ఇప్ప‌టికే జాన్వీ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూల్లో త‌న‌కి సౌత్‌లో ఎంట్రీ ఇచ్చే ఆలోచ‌న ఇపుడు లేద‌ని చెప్పింది.