మళ్లీ శ్రీరెడ్డి, కత్తి మహేష్ విజృంభణ!

వాళ్ల లొల్లి పోయింది అనుకున్నాం. కానీ శ్రీరెడ్డి, కత్తి మహేష్ మళ్లీ చేతులు కలిపినట్లున్నారు. ఇద్దరూ మళ్లీ పవర్‌స్టార్‌ని టార్గెట్ చేయనున్నారా అనిపిస్తోంది.
రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకి గురైన కత్తి మహేష్..తాజాగా శ్రీరెడ్డిని కలిశాడు. ఎక్కడ కలిశాడో తెలియదు కానీ ఆ ఫోటోలను శ్రీరెడ్డి షేర్ చేసింది. ఎవరి ఫేస్ చేస్తే పీకే ఫ్యాన్స్ రక్తం ఉడుకుతుందో వాడే కత్తిగాడు అంటూ ఒక క్యాప్సన్‌ని కూడా వదిలింది.
గతంతో పోల్చితే ఇపుడు శ్రీరెడ్డి చేస్తున్న మాటలకి వ్యాల్యూ లేదు. ఆమె కామెంట్లు, హడావుడి అంతా ఫేస్‌బుక్‌కే పరిమితం అయింది. తెలుగు మెయిన్‌స్ట్రీమ్ మీడియా పూర్తిగా బహిష్కరించింది ఆమెని. ఇంతకుముందు నెత్తిన పెట్టుకున్న సంస్థలే ఆమె పేరు చెపితే ఎందుకొచ్చిన తంటా అని ఛీదరించుకునే పరిస్థితి ఉంది. కత్తి మహేష్ నగర బహిష్కరణ జరిగిన తర్వాత టీవీ ఛానెల్స్ కూడా అతన్ని టీవీ షోలకి పిలవడం లేదు.
ఐతే త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సందర్భంలో శ్రీరెడ్డి, కత్తి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. వీరిద్దరూ ఎవరిని టార్గెట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.
- Log in to post comments