ఈసారి సురేష్‌బాబు టార్గెట్

చాన్నాళ్ల తర్వాత శ్రీరెడ్డి తన పాత పద్దతుల్లో పోస్ట్‌లు పెడుతోంది. రీసెంట్‌గా ఆమె కొత్త ఆరోపణలు ఏవీ చేయలేదు. పాత వాటికే పోపు పెడుతోంది. ఎన్నికల సమయంలో ఆమె మళ్లీ యాక్టివ్ కావడం విశేషం. మొన్న పోస్ట్ చేసిన దాంట్లో కొరటాల శివపై తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఇపుడు నిర్మాత సురేష్‌బాబుని తిట్టింది.
"పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదుల్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు. వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియోస్, అంటూ పోస్ట్ చేసింది.
హీరోయిన్ త్రిషను రానా ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను, రానా తమ్ముడు అభిరామ్ తనని ముద్దాడుతున్న ఫొటోలను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. త్రిష, రానా ఫోటో గూగుల్‌లో దొరుకుతున్నదే. అది ఆమె సాధించింది ఏమీ లేదు. ఇక అభిరామ్ - శ్రీరెడ్డి ఫోటో గతేడాది ఆమె బయటపెట్టినదే. కొత్తగా ఆమె చేస్తున్న పోస్ట్ లు కేవలం ఎన్నికల టైమ్ హడావుడిలా ఉంది.
- Log in to post comments